Sunday, March 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజాతీయ రహదారిపై కారు దగ్ధం

జాతీయ రహదారిపై కారు దగ్ధం

- Advertisement -

నవతెలంగాణ-బీబీనగర్‌
యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్‌ మండల పరిధి సమీపంలో వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై శనివారం కారులో మంటలు వ్యాపించి దగ్ధమైంది. ఇందుకు సంబంధించి సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన వద్ది రాజు- శిరీష దంపతులు ఆరోగ్య పరీక్షల నిమిత్తం కారులో సికింద్రబాద్‌లోని యశోద ఆస్పత్రికి వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో డ్రైవర్‌ కారులో ఏసీ పెంచడంతో ఇంజిన్‌లో పొగలు వచ్చాయి. దీంతో డ్రైవర్‌ నరేష్‌ అప్రమత్తమై కారును రోడ్డు పక్కన ఆపి పరిశీలిస్తుండగానే మంటలు వ్యాపించాయి. వెంటనే రాజు, శిరీష దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు, హైవే సిబ్బంది అక్కడకు చేరుకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -