- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓఆర్‌ఆర్‌పై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో డ్రైవర్ బయటకు రాలేక సజీవ దహనమయ్యాడు. కొన్ని క్షణాల్లోనే కారు పూర్తిగా దగ్ధమైంది. శామీర్‌పేట సమీపంలో ఈ ఘటన జరగ్గా.. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
- Advertisement -


