– వ్యక్తి సజీవ దహనం
నవతెలంగాణ -శామీర్‌పేట
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై విషాద ఘటన జరిగింది. కారులో మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం జైగిరి గ్రామానికి చెందిన తల్లపల్లి దురా ్గప్రసాద్(30) ఈ69 డిజిటల్ న్యూస్ ఛానల్ పార్ట్‌నర్. ఆదివారం వృత్తి పని మీద హైదరాబాద్‌కు వెళ్లి రాత్రి మియాపూర్‌లో బంధువుల ఇంట్లో ఉండి సోమవారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటలకు కారులో బయలు దేరాడు. ఓఆర్‌ఆర్‌పై శామీర్‌పేట దాటి కీసర వైపు వెళ్తున్న దారిలో వాహనా న్ని రోడ్డుకు ఓవైపున ఆపి పడుకున్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. అయితే, ఉదయం 6 గంటల సమయంలో డయల్-100 ద్వారా శామీర్ పేట పోలీసులకు ఓఆర్‌ఆర్‌పై ఒక కారు అగ్నికి ఆహుతవుతోందని సమా చారం అందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా.. అప్పటికే కారు పూర్తిగా మంటల్లో కాలిపోతోంది. ఫైర్ ఇంజిన్ మంటలను ఆర్పేసింది. డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తి పూర్తిగా సజీవ దహనమై.. మృతదేహం అస్థి పంజరంలా మారింది. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిం చింది. ప్రాథమిక విచారణలో భాగంగా.. మంటల్లో కాలిపోయిన ఆ కారు ఫోర్డ్ ఎకోస్పోర్ట్, రిజిస్ట్రేషన్ నెం:టీఎస్03 ఎఫ్‌డీగా 7688గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తు న్నట్టు శామీర్‌పేట ఎస్‌హెచ్‌ఓ శ్రీనాథ్ తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో స్పష్టమవుతాయని పోలీసులు చెప్పారు.
శామీర్‌పేట్ ఓఆర్‌ఆర్‌పై కారులో మంటలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



