Monday, May 19, 2025
Homeక్రైమ్కారు డోర్‌ లాక్‌

కారు డోర్‌ లాక్‌

- Advertisement -

ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి
ద్వారపూడి:
విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలో ఆదివారం తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసు కుంది. కారు డోర్‌ లాక్‌ కావడంతో ఊపిరాడక నలుగురు చిన్నారులు మరణించారు. గ్రామస్తుల కథనం ప్రకారం… విజయనగరం మండలం ద్వారపూడి గ్రామానికి చెందిన కంది మనీశ్వరి (6), బూర్లి చారులత (7), బూర్లి జాశ్రిత (8), మంగి ఉదరు (7) ఆదివారం ఉదయం ఆడుకునేందుకు ఇళ్ల నుంచి బయటకు వెళ్లారు. గ్రామంలో నీళ్ల ట్యాంకు వద్ద ఆగి ఉన్న కారు డోరు తీసి సరదాగా లోపలికి వెళ్లి కూర్చున్నారు. ఇంతలో కారు డోర్‌ లాక్‌ పడడంతో అందులో చిక్కుకుపోయారు. పిల్లలు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వారి కోసం వెతికినా కనిపించలేదు. కారులోని చిన్నారులను స్థానికులు చూసి అద్దాలు పగలుకొట్టి వారిని బయటకు తీశారు. అప్పటికే నలుగురూ మృతి చెందారు. మృతుల్లో చారులత, జాశ్రిత అక్కచెల్లెళ్లు. చిన్నారుల తల్లిదండ్రులు రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకేసారి నలుగురు చిన్నారుల మృతితో ఆ గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి పోలీసులు తరలించారు. విజయనగరం రూరల్‌ ఎస్‌ఐ వి.అశోక్‌ కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -