Saturday, September 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుShankarpalli road robbery case: శంకర్‌పల్లి దారి దోపిడీ కేసులో కారు డ్రైవరే ప్రధాన సూత్రధారి

Shankarpalli road robbery case: శంకర్‌పల్లి దారి దోపిడీ కేసులో కారు డ్రైవరే ప్రధాన సూత్రధారి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీకి పాల్పడిన ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. జడ్చర్లలో శుక్రవారం అర్ధరాత్రి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి స్టీల్ వ్యాపారి డ్రైవర్ మధు పోలీసులు అని గుర్తించారు. వికారాబాద్‌ వెళ్లి నగదు తీసుకొస్తున్న విషయాన్ని మధు తన గ్యాంగ్‌కు చెప్పాడు. అనంతరం మధు, సాయిబాబాపై దాడి చేసినట్టు నటించి దుండగులు నగదు బ్యాగుతో పరారయ్యారని పోలీసులు వెల్లడించారు.

మేడ్చల్‌ జిల్లా కీసరకు చెందిన స్టీల్‌ వ్యాపారి రాకేశ్‌ అగర్వాల్‌ వికారాబాద్‌లో తనకు రావాల్సిన రూ.40 లక్షల కోసం డ్రైవర్‌ మధు, సహాయకుడు సాయిబాబాను శుక్రవారం ఉదయం పంపారు. వారిద్దరూ డబ్బు తీసుకొని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. శంకర్‌పల్లి మండలం హుస్సేన్‌పూర్‌-పర్వేద గ్రామాల మార్గంలోకి రాగానే ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఆ తర్వాత నిందితులు.. తుపాకీ, కత్తితో బెదిరించి డబ్బులు దోచుకెళ్లారు. అయితే కొద్దిదూరం వెళ్లాక నిందితుల కారు బోల్తాపడటంతో రూ.8.5 లక్షలు వదిలేసి మిగిలిన డబ్బుతో పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి పట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -