Thursday, January 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకారు దగ్ధం.. తప్పిన ప్రమాదం

కారు దగ్ధం.. తప్పిన ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ-కడ్తాల్‌
కారు దగ్ధమైన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండల పరిధిలో బుధవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కడ్తాల్‌ మండలం నుంచి హైదరాబాద్‌ కారులో వెళ్తుండగా మండలంలోని మక్తమాధారం గేట్‌ సమీపంలో బుధవారం ప్రమాదవశాత్తు ఒక కారు అకస్మాత్తుగా మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. కారు ముందు భాగం నుంచి పొగ రావడం గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే వాహనం ఆపి బయటకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. కొద్దిసేపటికే మంటలు పూర్తిగా కారును చుట్టుముట్టడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది. స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -