Saturday, November 1, 2025
E-PAPER
Homeక్రైమ్బైకును ఢీ కొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు 

బైకును ఢీ కొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు 

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రం శివారులోని మోర్తాడ్ రోడ్ లో గల హెచ్ పి పెట్రోల్ పంపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన బైండ్ల భూమన్న (డిస్కో భూమన్న) అనే వ్యక్తి హెచ్.పీ పెట్రోల్ పంపులు తన బైక్ లో పెట్రోల్ పోయించుకుని రోడ్డు దాటుతుండగా కమ్మర్ పల్లి నుండి మోర్తాడ్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు అతివేగంగా బైకును ఢీకొట్టడంతో బైక్ పైన ఉన్న భూమన్న ఎగిరి రోడ్డుపైన పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని 108 అంబులెన్సులో నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -