- Advertisement -
నవతెలంగాణ – మిడ్జిల్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం మండలంలోని వాడియాల కే ఎల్ ఐ కాల్వ దగ్గర జడ్చర్ల-కల్వకుర్తి ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం నేరేళ్లపల్లి గ్రామానికి చెందిన సాకలి ప్రేమ్ కుమార్ జడ్చర్ల నుండి స్కూటీపై మిడ్జిల్ కు వస్తుండగా కల్వకుర్తి నుండి జడ్చర్ల వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ప్రేమ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా చికిత్స కోసం 108 వాహనంలో జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివనాగేశ్వర్ నాయుడు తెలిపారు.
- Advertisement -



