Monday, February 23, 2026
E-PAPER
Homeక్రైమ్కాలువలో కారు బోల్తా.. వ్యక్తి మృతి

కాలువలో కారు బోల్తా.. వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – మల్యాల
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ఎక్స్‌ రోడ్డు సమీపంలోని వరద కాలువ నీటిలో కారు బోల్తా పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. పెగడపల్లి మండలం సుద్దపెల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు తిర్మని రమణారెడ్డి (53) ఈ నెల 18న ఇంటి నుంచి కారులో వెళ్లాడు. తెల్లవారే వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదైంది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేశారు. ఆదివారం వరద కాలువలో కారుపైకి తేలియాడుతుండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న వారు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. అంబులెన్స్‌ ద్వారా జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా రమణ బీఆర్‌ఎస్‌ హయాంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మెన్‌గా పని చేశారు. అనంతరం బీజేపీలో చేరి ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -