- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్ : ఇంటి పరిసరాలలో నీరు నిలువ లేకుండా జాగ్రత్తలు పాటించాలని మండల వైద్యాధికారి యేమిమా తెలిపారు. శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా గ్రామాలలోని ఆయా సబ్ సెంటర్లలో గ్రామ ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని డెంగ్యూ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి దివ్య, హెచ్ ఇ వో వెంకటరమణ, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.
- Advertisement -