నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి,ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక కెరీర్ గైడెన్స్ సెషన్ ను ఇందారపు దావీదు రాజ్ శుక్రవారం నిర్వహించారు. పది పయనం తరువాత ఏ కోర్సులు, ఎంట్రెన్స్ పరీక్షలు, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో తదితర అంశాలను వివరించారు. ఎంపిసి, బైపిసి, సిఈసి, హెచ్ ఇసి వోకేషనల్ కోర్సులు, తదుపరి డిగ్రీలు, జెఈఈ, నిట్, క్లాట్, ఎన్ డిఏ, క్యాట్ వంటి ఎంట్రెన్స్ పరీక్షల గురించి వివరించారు.
ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగం కోసం ఏలా ప్రేపరషన్ అవ్వాలనే దానిపై వివరించారు. విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్, కంప్యూటర్, సమస్య పరిష్కారం, టైమ్ మేనేజ్‌మెంట్, మంచి అలవాట్లు, రోజువారీ రొటీన్ వంటి నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన అవసరం గుర్తు చేశారు. విద్యార్థులు ప్రశ్నలు అడిగి ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగ అవకాశాలు గురించి స్పష్టమైన సమాచారం పొందారు.



