Thursday, December 18, 2025
E-PAPER
Homeఆటలుక్యారీ సెంచరీ

క్యారీ సెంచరీ

- Advertisement -

ఆస్ట్రేలియా 326/8
యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్ట్‌

ఆడిలైడ్‌ : యాషెస్‌ సిరీస్‌ మూడోటెస్ట్‌లో ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ సెంచరీతో రాణించాడు. మిడిలార్డర్‌లో ఉస్మాన్‌ ఖవాజా కూడా అర్ధసెంచరీతో రాణించడంతో తొలిరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు 8వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. ఇంగ్లండ్‌ బౌలర్లు తొలుత కట్టడిగా బౌలింగ్‌ చేయడంతో ఆసీస్‌ ఓపెనర్లు హెడ్‌(10), వెథర్లాండ్‌(18)కి తోడు లబూషేన్‌(19) స్వల్ప స్కోర్లకే పెవీలియన్‌కు చేరారు. ఆసీస్‌ జట్టు 33 పరుగుల వద్ద ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ఖవాజా, క్యారీ ఆదుకోవడంతో ఆ జట్టు గౌరవప్రద స్కోర్‌ చేసింది. క్రీజ్‌లో స్టార్క్‌(33), లియాన్‌(0) ఉన్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లు ఆర్చర్‌కు మూడు, కర్సే, విల్‌ జాక్స్‌కు రెండేసి, టంగ్‌కు ఒక వికెట్‌ దక్కాయి. ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యతలో ఉంది.

స్కోర్‌బోర్డు…
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి)క్రాలే (బి)కర్సే 10, వెథర్లాండ్‌ (సి)జేమీ స్మిత్‌ (బి)ఆర్చర్‌ 18, లబూషేన్‌ (సి)కర్సే (బి)ఆర్చర్‌ 19, ఖవాజా (సి)టంగ్‌ (బి)విల్‌ జాక్స్‌ 82, గ్రీన్‌ (సి)కర్సే (బి)ఆర్చర్‌ 0, క్యారీ (సి)జేమీ స్మిత్‌ (బి)విల్‌ జాక్స్‌ 106, ఇంగ్లిస్‌ (బి)టంగ్‌ 32, కమిన్స్‌ (సి)పోప్‌ (బి)కర్సే 13, స్టార్క్‌ (బ్యాటింగ్‌) 33, లియాన్‌ (బ్యాటింగ్‌) 0, అదనం 13. (83ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 326పరుగులు.
వికెట్ల పతనం: 1/33, 2/33, 3/94, 4/94, 5/185, 6/244, 7/271, 8/321.
బౌలింగ్‌: ఆర్చర్‌ 16-529-3, కర్సే 13-0-70-2, టంగ్‌ 15-1-63-1, స్టోక్స్‌ 19-3-53-0, విల్‌ జాక్స్‌ 20-3-105-2.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -