నవతెలంగాణ – హైదరాబాద్: సినీ నటి కల్పికా గణేష్ తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ప్రిజం పబ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కేక్ విషయంలో మొదలైన చిన్నపాటి వాగ్వాదం తీవ్రస్థాయికి చేరి, చివరికి పోలీసు కేసు వరకు దారితీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే… నటి కల్పిక గత నెల 29న ప్రిజం పబ్‌కు వెళ్లారు. రూ. 2200 బిల్ చేసి, కాంప్లిమెంటరీగా కేక్ ఇవ్వమని కోరారట. అలా ఇవ్వడం కుదరదని మేనేజర్ చెప్పారు. ఈ విషయంలో కల్పిక గణేశ్‌కు, పబ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో నటి కల్పిక తమ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కల్పికపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నటి కల్పిక గణేశ్‌పై కేసు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES