నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పైన సకల జనుల సమ్మె సమయంలో నమోదైన కేసును నాంపల్లి కోర్టు సోమవారం కొట్టేసింది. అనంతరం కేసును వాదించిన బీఆర్‌ఎస్ లీగల్ సెల్ సభ్యులు జక్కుల లక్ష్మణ్ మాట్లాడుతూ 2009 నుంచి తెలంగాణ ఉద్యమ కేసులను వాదిస్తున్నానని చెప్పారు. కేసీఆర్ రైలు రోకో కేసుతోపాటు సకల జనుల సమ్మె కేసును చూస్తున్నానని వివరించారు. ఉద్యమ న్యాయవాదిగా కేసీఆర్ సకల జనుల సమ్మె కేసు గురించి వాదించానని అన్నారు. 2011 సమయంలో బంజారాహిల్స్ పోలీసులు సకల జనుల సమ్మె పిలుపులో భాగంగా కేసీఆర్, కేటీఆర్, పద్మారావు, శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, కోదండరామ్ మరికొందరిపై కేసు నమోదైందని చెప్పారు. ఆ కేసును నాంపల్లి కోర్టు కొట్టేసిందని వివరించారు.
కేసీఆర్, కేటీఆర్‌పై కేసు కొట్టివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



