Saturday, January 31, 2026
E-PAPER
Homeఆదిలాబాద్హత్యాయత్నం చేసిన భర్త కుటుంబ సభ్యులపై కేసు

హత్యాయత్నం చేసిన భర్త కుటుంబ సభ్యులపై కేసు

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
భార్యపై హత్యాయత్నం చేసిన భర్త, కుటుంబ సభ్యులపై శనివారం కేసు నమోదు చేసినట్లు జన్నారం ఎస్ ఐ గొల్లపల్లి అనూష తెలిపారు. ఆమె తెలిపిన వివ రాల ప్రకారం జన్నారం గ్రామానికి చెందిన రుబీనా తబ్ రోజ్ ను అదే గ్రామానికి చెందిన అబ్దుల్ జుబేరుతో 26 నవంబర్ 2021న పెద్దల సమక్షంలో 4 తులాల బంగారం, రూ.1.5 లక్షల నగదు,హోండా షైన్, ఫర్నిచర్ ఇచ్చి వివాహం చేశామని తెలిపారు. ఆ తర్వా త పెండ్లైన 15 రోజుల నుండి ఆమెను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టడాని ఈ నెల 29న ఆమెను నానాబూతులు తిడుతూ, సెల్ ఫో నుతో తలపై కొట్టి, వైరుతో మెడ చుట్టూ గట్టిగా చుట్టి హత్యాయత్నంను పాల్పడ్డారని ఆమె అన్న అంజన్ ఖాన్ ఇచ్చిన పిర్యాదు మేరకు ఆమె భర్త అబ్దుల్ జుబేర్,అత్త నూర్జాన్, ఆడపడుచు సహన పై హత్యాయత్నం కేసు నమోదు చేసుకున్నట్లు ఆమె తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -