Saturday, July 12, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఆత్మహత్య చేసుకుంటానని తహశీల్దార్ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు

ఆత్మహత్య చేసుకుంటానని తహశీల్దార్ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం: భూ వ్యవహారంలో పురుగుల మందు  మందు డబ్బా పట్టుకొని తాగి చనిపోతానని తహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేస్తూ విధులకు ఆటంకపరిచిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందని జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు. ఎస్సై అనూష తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన కయ్యం మల్లయ్య, రెండో కుమారుడు కయ్యం తిరుపతి భార్య లావణ్య పట్ట మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నారు. మల్లయ్య చిన్న కుమారుడైన రామన్న శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తాహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పురుగుల మందు తాగి చనిపోతానంటూ బ్లాక్ మెయిల్ చేసి, విధులకు ఆటంక పరిచినందుకు తాహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆమె తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -