Wednesday, March 4, 2026
E-PAPER
Homeజాతీయంఎంపీ అగా సయ్యద్‌ రుహుల్లా మొహదీపై కేసు ఫైల్

ఎంపీ అగా సయ్యద్‌ రుహుల్లా మొహదీపై కేసు ఫైల్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సోషల్‌మీడియాలో తప్పుడు కంటెంట్‌ను ప్రసారం చేశారనే ఆరోపణలపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) ఎంపి అగా సయ్యద్‌ రుహుల్లా మొహదీ, శ్రీనగర్‌ మాజీ మేయర్‌ జునైద్‌ అజీమ్‌ మట్టులపై కేసు నమోదైంది. భయాన్ని సృష్టించడం, శాంతిభద్రతలకు విఘాతం కల్పించడం మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రేరేపించే ఉద్దేశ్యంతో డిజిటల్‌ మరియు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు, కల్పిత మరియు తప్పుదారి పట్టించే కంటెంట్‌ను ప్రసారం చేశారన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ కంటెంట్‌ వక్రీకరించిన కథనాల వ్యాప్తిని మరియు ధృవీకరించని సమాచారాన్ని ప్రతిబింబిస్తుందని, శాంతిభద్రతలకు విఘాతం కల్పించడం, సామాజిక అసమానతకు కారణమని పేర్కొన్నారు. శ్రీనగర్‌లోని సైబర్‌ పోలీస్‌స్టేషన్‌లో బిఎన్‌ఎన్‌ఎస్‌ సెక్షన్లు 197(1)(డి), 353(1)(బి)కింద రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులపై దర్యాప్తు చేపట్టామని అన్నారు.

ఈ దేశ పౌరుడిగా మీ దురాగతాలకు, చట్టాల ఉల్లంఘనకు వ్యతిరేకంగా, తన హక్కులను కాపాడుకునేందుకు, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం చివరి రక్తపు బట్టువరకు పోరాడతానని ఎన్‌సి ఎంపి మెహదీ తెలిపారు. జమ్ముకాశ్మీర్‌ పోలీసులు మరియు యంత్రాంగంలోని కొందరు మూర్ఖులు తన భద్రతను తగ్గించడం, ఫేస్‌బుక్‌ ఖాతాను నిలిపివేయడం ద్వారా వారి దురాగతాలను ప్రపంచానికి తెలియకుండా చేయవచ్చని భావిస్తున్నారు. ఈ చర్య హాస్యాస్పదమని అన్నారు.
అమెరికా -ఇజ్రాయిల్‌ సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీ హత్యపై తన ప్రకటన కారణంగా భద్రతను ఉపసంహరించుకున్నారని మాజీ మేయర్‌ మట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -