- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో సోమవారం జరిగిన ఘటనలో ఇరు వర్గాలకు చెందిన వారిపై కేసులు నమోదు చేసినట్లు ముధోల్ సిఐ మల్లేష్ సోమవారం రాత్రి విలేకరులకు తెలిపారు. ఇరు వర్గాలకు చెందిన ఐదుగురిని ప్రస్తుతం అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనలో పాల్గొన్న మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పూర్తి విచారణ ఆనంతరం ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరిని త్వరలో అరెస్టు చేస్తామని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
- Advertisement -