నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌లో రాంగ్ రూట్‌లో వెళ్లడమే కాకుండా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించారంటూ ఆయనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద శ్రీనివాస్ తన కారులో రాంగ్ రూట్‌లో వచ్చాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా, సదరు హీరోను ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకుని హెచ్చరించారు. రాంగ్ రూట్‌లో ఎలా వస్తారంటూ కానిస్టేబుల్ ప్రశ్నించడంతో శ్రీనివాస్ అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు. ఇక, ప్రస్తుతం ఈ యువ హీరో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. భైరవం, టైసన్ నాయుడు, హైందవ, కిష్కింధపురి చిత్రాల్లో నటిస్తున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES