కోచి : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై అభ్యంతరకర వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు వివాదాస్పద జర్నలిస్టు, క్రైమ్ నందకుమార్‌గా పేరొందిన టి.పి.నందకుమార్‌పై కేసు నమోదు చేశారు. కొజికొడ్‌లోని మంకవ్ నివాసి అయిన నందకుమార్‌పై ఎర్నాకుళం నగర సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 192 కింద, అలాగే అభ్యంతరకర సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించినా లేదా ప్రసారం చేసినా అందుకు సంబంధించిన నేరాలను పరిశీలించే ఐటి చట్టంలోని సెక్షన్ 67, 67(ఎ)ల కింద శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడు తన ఫేస్‌బుక్ పేజీలో, యూ ట్యూబ్ చానెల్‌లో ఒక అసభ్యకరమైన వీడియోను పోస్టు చేశాడని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. సైబర్ గస్తీ సమయంలో సంచలనాత్మకమైన కుంభకోణంతో ప్రమేయమున్న ఒక వివాదాస్పద మహిళతో ముఖ్యమంత్రికి ముడిపెడుతూ క్యాప్షన్ ఇచ్చాడని పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఇదే తరహాలో నందకుమార్‌పై అప్రతిష్టాకరమైన కేసులు నమోదయ్యాయి. 2022 డిసెంబరులో ఎర్నాకుళం నార్త్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. సిల్వర్‌లైన్ సెమీ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టుతో ముడిపెడుతూ ముఖ్యమంత్రి విజయన్‌పై సోషల్ మీడియాలో అప్రతిష్టకరమైన పోస్టు పెట్టినందుకు ఈ కేసు నమోదైంది.
కేరళ సీఎం పై అభ్యంతరకర పోస్టు జర్నలిస్టుపై కేసు నమోదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES