నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని ముద్గల్ గ్రామంలో గల రెండు రైస్ మిల్లులపై కేసు నమోదు చేసినట్లు ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ఎస్ఐ కధనం ప్రకారం… ముద్గల్ గ్రామ సమీపాన గల ఏషియన్ రైస్ మిల్ లో యాజమాని మషర్రోద్దిన్ 2024 -25 సంవత్సరం ఖరిప్, రభీలో సేకరించిన 4411.917 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యంను ప్రభుత్వానికి సిఎంఆర్ ఇవ్వాలి. కానీ అయితే ఇవ్వలేదని తెలిపారు. అలాగే గణపతి రైస్ మిల్ లో యజమాని చింతా శ్రీనివాస్ 2024-25 ఖరీఫ్, రబీలో 2699.531 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బియ్యంగా మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి సిఎంఆర్ ఇవ్వలేదు.
దీంతో సివిల్ సప్లై అధికారులు రైస్ మిల్లులను తనిఖీ చేసి, అక్కడ బియ్యం నిల్వలు లేకపోవడంతో ఈనెల 8వ తేదీన ముధోల్ పోలీస్ స్టేషన్లో సివిల్ సప్లై డిఎం సుధాకర్ ఫిర్యాదు చేశారని ఎస్ఐ చెప్పారు. రైస్ మిల్లుల యాజమానులు ప్రభుత్వంతో చేసుకున్న ఓప్పందాన్ని ఉల్లంఘించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఏషియన్ రైస్ మిల్ యాజమాని 12శాతం వడ్డీతో కలిపి సుమారు రూ.18కోట్ల 1లక్ష 3205, గణపతి రైస్ మిల్ యాజమాని రూ.11కోట్ల 2లక్షల 191 విలువ గల దుర్వినియోగానికి పాల్పడ్డారని సివిల్ సప్లై అధికారులు పిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. దీంతో రైస్ మిల్ యాజమానులపై సెక్షన్ 316(2) ,316,(5)318(4) బిఎన్ఎస్ తో పాటు వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన్నట్లు ఎస్ఐ తెలిపారు. సివిల్ సప్లై డిఎం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
ముద్గల్ రైస్ మిల్లులపై కేసు నమోదు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES