Thursday, May 15, 2025
Homeఖమ్మంపేకాట రాయుళ్ళపై కేసు నమోదు

పేకాట రాయుళ్ళపై కేసు నమోదు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట: మండల పరిధిలోని నారంవారిగూడెం కాలనీ శివారులో గల ఓ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై బుధవారం పోలీసులు దాడి చేశారు. స్థానిక ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం .. వ్యవసాయ క్షేత్రంలో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సోదాలు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారినుండి రూ.3100, రెండు బైకులు, రెండు సెల్ఫోన్ లను, ఒక ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు. కాగా మరో ఇద్దరు వ్యక్తులు పారిపోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -