- Advertisement -
నవతెలంగాణ మహదేవపూర్
మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామ శివారులో ముగ్గురు అనుమానితులు పశువులను అక్రమంగా తరలిస్తున్నారని మహదేవపూర్ పోలీసులకు సమాచారం అందగా వెంటనే మహదేవపూర్ పోలీసులు అక్కడికి చేరుకోగా, అక్కడ కాటారం గ్రామం, దేవదుల గ్రామం కన్నాయిగూడెం మండలం మరియు బిట్టు పల్లి గ్రామం మంథనీ మండలం నకు చెందిన ముగ్గురు వ్యక్తులు పశువులను అక్రమంగా తరలిస్తున్న వారిని పట్టుకుని,వారి వద్ద నుండి ఒక వాహనం లో08 ఎద్దులు ఒక లేగ దూడ ను స్వాధీనం చేసుకోనైనది ,అట్టి ముగ్గురు వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు మహాదేవపూర్ ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.
- Advertisement -



