Friday, November 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమూడ్రోజుల్లో 550కిపైగా వాహనాలపై కేసులు

మూడ్రోజుల్లో 550కిపైగా వాహనాలపై కేసులు

- Advertisement -

ఓవర్‌ లోడ్‌ వాహనాలపై రవాణా శాఖ కఠిన చర్యలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో మోటారు వాహనాల చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై రవాణాశాఖ కొరడా ఝలిపిస్తోంది. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఆ శాఖ ప్రత్యేకించి ఓవర్‌లోడ్‌ వాహనాలపై కఠిన చర్యలు చేపట్టింది. మూడ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 550కిపైగా వాహనాలపై కేసులు నమోదు చేసినట్టు రవాణాశాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందులో 60కిపైగా ఓవర్‌లోడ్‌తో నడుస్తున్న వాహనాలు ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు మోటారు వాహనాల చట్టా లను ఉల్లఘించిన 1,15,000కుపైగా వాహనా లపై కేసులు నమోదు చేశామని రవాణా శాఖ తెలిపింది.

ఇందులో 5వేలకుపైగా ఓవర్‌ లోడ్‌తో తిరుగుతున్న వాహనాలు కాగా, 9వేలకు పైగా ప్రయివేట్‌ బస్సులు ఉన్నాయని, ఇవే కాకుండా ఫిట్‌నెస్‌ లేని వాహనాలు, టాక్స్‌ లేకుండా తిరిగే వాహనాలతోపాటు పర్మిట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌ వంటి ధ్రువప్రతాలు లేని వాహనాలు కూడా పెద్దసంఖ్యలో ఉన్నాయని పేర్కొంది. ఇటీవల చేవెళ్ల సమీపంలో ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ కారణంగా ఘోర ప్రమాదం జరగడంతో రవాణాశాఖ అప్రమత్త మైంది. రాష్ట్రంలోని 33 జిల్లాల రవాణా శాఖ అధికారు లకు ఓవర్‌లోడ్‌ వాహనాలపై తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొంది.

త్వరలో మైనింగ్‌ శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం
నిబంధనలు ఉల్లఘించిన వాహనాలపై మూడ్రో జులు విస్తృత తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేశారు. త్వరలో మైనింగ్‌ శాఖ అధికారు లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపింది. వాహనాలకు లోడ్‌ వేసే రీచ్‌లు, క్వారీలలోనే ఓవర్‌లోడ్‌ను నిరోధించే విధంగా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ సమావేశంలో చర్చిస్తా మని రవాణాశాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు రోడ్డు భద్రతా కమిటీ కూడా గనుల శాఖ, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేసి క్వారీల వద్దే ఓవర్‌లోడింగ ్‌ను నిరోధించాలని ఆదేశాలు జారీ చేసింది. వాహన యజమానులు, డ్రైవర్లు నిబంధనలు పాటిస్తూ, సురక్షిత ప్రయాణానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -