Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలపై కేసులు

కామారెడ్డి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలపై కేసులు

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తనిఖీల్లో పలు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన గృహ వినియోగ ఎల్ పి జి సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలు నస్రుల్లాబాద్, నాగిరెడ్డిపేట్, మాచారెడ్డి, పాల్వంచ, భిక్నూర్ పాలు మండలాల్లో నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల సందర్భంగా గృహ వినియోగానికి ఉద్దేశించిన 23 ఎల్ పి జి సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో సంబంధిత వ్యక్తులపై Essential Commodities Act, 1955 చట్టంలోని సెక్షన్ 6 ఎ  ప్రకారం కేసులు నమోదు చేసి సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

అధికారుల వివరాల ప్రకారం జిల్లాలో మొత్తం 5,595 ఎల్ పి జి కనెక్షన్లు ఉండగా, అందులో 4,498 రీఫిల్లులు పంపిణీ చేయబడ్డాయి. ప్రస్తుతం జిల్లాలో ఎల్ పి జి డిమాండ్‌కు అనుగుణంగా సుమారు 5,785 రీఫిల్లుల స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరఫరా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

ఇకపై కూడా అక్రమంగా ఎల్ పి జి సిలిండర్ల నిల్వ, వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు సిలిండర్లను భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఉపయోగించాలని సూచించారు.

అలాగే ఖాళీ సిలిండర్లను రీఫిల్ చేసిన తర్వాత తిరిగి అందజేయాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో సిలిండర్ బుకింగ్ తర్వాత 25 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల్లోగా రీఫిల్ చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ వివరాలను జిల్లా పౌర సరఫరాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -