Monday, December 1, 2025
E-PAPER
Homeఆదిలాబాద్స్థానిక ఎన్నికల్లో మద్యం, డబ్బులు తరలిస్తే కేసులు

స్థానిక ఎన్నికల్లో మద్యం, డబ్బులు తరలిస్తే కేసులు

- Advertisement -

బైంసా రూరల్ సిఐ నైలు నాయక్
నవతెలంగాణ – కుభీర్
స్థానిక సర్పంచ్ ఎన్నికలో మహారాష్ట్ర  సరిహద్దుల నుంచి తెలంగాణా కు డబ్బులు, మద్యం తరలిస్తే కేసులు నమోదు చేస్తామని బైంసా రూరల్ సి ఐ నైలు నాయక్ అన్నారు. సోమవారం కుభీర్ మండలంలోని మార్లగొండ గ్రామ పంచాయతీ సరిహద్దు ఐన సేవదాస్ నగర్ సమీపంలో ఉన్న అంతర్ రాష్ట్ర చెక్క్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా సి ఐ నైలు మాట్లాడుతూ.. మండలంలో 17న జరగనున్న స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి మద్యం కానీ డబ్బులు  తరలించినట్లయితే వారిపైన కేసులు నమోదు చేస్తామని అన్నారు. దింతో పాటు గ్రామమలో ఉన్న ఓటర్లకు అభ్యర్థులు ఎలాంటి ప్రలోబాలు చేయకుండా ప్రజలకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాలని తెలిపారు. ఆయన వెంట కుభీర్ ఎస్ ఐ కృష్ణ రెడ్డి పోలీస్ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -