Saturday, April 4, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గ్యాస్ కృత్రిమ కొరతలు సృష్టిస్తే కేసులు

గ్యాస్ కృత్రిమ కొరతలు సృష్టిస్తే కేసులు

- Advertisement -

తహశీల్దార్ శివరాజ్, ఎస్సై శ్రీనివాస్..
నవతెలంగాణ – కుభీర్
గ్యాస్ కృత్రిమ కొలతలు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని కుబీర్ తాసిల్దార్ శివరాజ్  ఎస్సై శ్రీనివాస్ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రమైన కుబీర్ లోని విశ్వేశ్ ఇండియన్ గ్రామీణ్ విత్ తారక్ ఏజెన్సీలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అక్కడ ఉన్న గోదాంలో  గ్యాస్ నిలువలను పరిశీలించి స్టాక్ రిజిస్టర్ లను  తనిఖీలు చేశారు. స్టాక్ వివరాలను యజమానిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రజలు గ్యాస్ కృత్రిమ కొరతలు ఏర్పాటు తాయని ఎలాంటి అపోవాలని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఏజెన్సీల్లో వంటలకు అవసరమైన గ్యాస్ నిల్వలు  ఉన్నాయని తెలిపారు. ప్రజలకు అవసరమైన గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకొని తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో గ్యాస్ ఏజెన్సీలో 340 గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని అవసరమైన వినియోగదారులు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ ఏజెన్సీ యజమాని వెంకటేష్, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -