Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమతోన్మాదులపై కేసు నమోదు చేయాలి

మతోన్మాదులపై కేసు నమోదు చేయాలి

- Advertisement -

మందుల సామ్యేల్‌ ఇంటిపై దాడికి కేవీపీఎస్‌ ఖండన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామ్యేల్‌ ఇంటిపై దాడి చేసిన మతోన్మాదులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారంగా కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బ్రాహ్మణ మంత్రాలను వ్యతిరేకించాడనే పేరుతో మతోన్మాదులు బోడుప్పల్‌లోని సామ్యేల్‌ ఇంటిపై కోడిగుడ్లతో దాడి చేసి దుర్భాషలాడారని ఆయన ఖండించారు. ప్రజాస్వామికవాదులందరు ఈ దాడిని ఖండించాలని ఆయన కోరారు. కేంద్రమంత్రి బండి సంజరు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వల్లె ఈ దాడి జరిగిందని ఆయన విమర్శించారు. ఈ దాడి వెనకాల బండి సంజరు హస్తం ఉందని ఆరోపించారు. సామేల్‌ మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే దాన్ని ఖండించవచ్చు. ఆయనపై కేసు నమోదు చేయవచ్చు. ప్రజాస్వామిక పద్దతులు కాదనీ, ఆయన ఇంటిపై దాడి చేయడమంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం కాదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో సుమారు 143 కుల దురహంకార హత్యలు జరిగితే ఏనాడు మతోన్మాద సంస్థలు ఈ హత్యలను ఖండించలేదని స్కైలాబ్‌ బాబు తప్పుపట్టారు. మిర్యాలగూడలో దళిత యువకుడు పెరుమాండ్ల ప్రణరును హత్య చేసిన అగ్రకుల పెత్తందారుడు మారుతిరావు హంతకుల పక్షాన ప్రదర్శన నిర్వహించారని గుర్తు చేశారు. అగ్రకుల హిందువుల పక్షాన మాత్రమే బీజేపీ మతోన్మాద సంస్థలు మాట్లాడుతాయా? అట్టడుగు వర్గాల హిందువుల మీద దౌర్జన్యాలు జరిగితే నోరు విప్పరా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే మందుల సామేల్‌ ఇంటిపై కోడిగుడ్ల తో దాడి చేసిన వారందరిపై అక్కడి సీసీ ఫుటేజ్‌ ఆధారంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు హత్యాప్రయత్నం కేసు నమోదు చేయాలనీ డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -