Wednesday, March 25, 2026
E-PAPER
Homeకరీంనగర్జాతీయ మెగా లోక్ అదాలత్ లో రాజితో కేసులను పరిష్కరించుకోవాలి

జాతీయ మెగా లోక్ అదాలత్ లో రాజితో కేసులను పరిష్కరించుకోవాలి

- Advertisement -

– జిల్లా ఎస్పీ మహేష్ బిగితే
నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల : ఈనెల 28న శనివారం  నిర్వహించబడనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోని రాజీ పడదగిన కేసులను పరస్పర అంగీకారంతో  పరిష్కరించుకోవలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు.
ఈలోక్ అదాలత్‌లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,సివిల్ వివాదాలు,ఆస్తి విభజన కేసులు, కుటుంబ పరమైన నిర్వహణ కేసులు, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చిన్నచిన్న పెట్టి కేసులు మరియు ఇతర రాజీ పడదగిన కేసులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు.జుడీషియల్ శాఖ అందించిన ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇరుపక్షాలు శాంతియుత పరిష్కారం పొందాలని సూచించారు.
జిల్లా పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్‌లు మరియు ఇతర సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాల వారికి కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ కుదిరేలా అవగాహన కల్పిస్తారని తెలిపారు. తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని భావించే వారు సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని జిల్లా ఎస్పీ  పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -