Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల క్రీడల్లో రికార్డు నెలకొల్పిన విద్యార్థినికి నగదు పురస్కారం

మండల క్రీడల్లో రికార్డు నెలకొల్పిన విద్యార్థినికి నగదు పురస్కారం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని కే.భువన మండల స్థాయి క్రీడల్లో రికార్డు నెలకొల్పారు. అమీర్ నగర్ మండల పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన మండల అంతర్ పాఠశాలల క్రీడల్లో  నిర్వహించిన ఖోఖో పోటీల్లో భువన రికార్డు సృష్టించారు.ఖోఖో ఆటలో భాగంగా కమ్మర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జట్టుతో జరిగిన మ్యాచ్ లో  8నిమిషాల 16 సెకండ్ల పాటు పత్యర్దికి దొరక్కుండా తప్పించుకోవడం ద్వారా మండల స్థాయి క్రీడా చరిత్రలో భువన రికార్డు సృష్టించింది. బుధవారం రాత్రి జరిగిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మండల స్థాయి క్రీడా చరిత్రలో రికార్డ్ నెలకొల్పిన కలిన భువన ను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఇతర అతిథులు అభినందించారు. ఈ సందర్భంగా మెమొంటోను, నగదు పురస్కారాన్ని అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -