Wednesday, October 1, 2025
E-PAPER
Homeఖమ్మంవాసవి క్లబ్ ఆధ్వర్యంలో పేద విద్యార్ధికి నగదు అందజేత

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పేద విద్యార్ధికి నగదు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
వాసవి క్లబ్ ఆద్వర్యంలో స్వాతంత్ర్య దినం పురస్కరించుకుని సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్ధి సుమంత్ కు రూ.25 వేల నగదును ల్యాప్ ట్యాప్ కొనుగోలు నిమిత్తం శుక్రవారం కమీషన్ బి.నాగరాజు చేతులు మీదుగా అందజేసారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని  జవహర్ కాన్వెంట్ లో రూ. 6 వేల వేతనంతో పని చేసే ఓక టీచర్ కుమారుడు సుమంత్ బీటెక్ చదువుతున్నాడు.

ఈ చదువు కు లాప్ టాప్ అవసరం ఉన్నా కొనుగోలు చేసే ఆర్ధిక స్థితి లేదని తెలుసుకున్న వాసవి క్లబ్  రీజనల్ చైర్మన్ బోగవల్లి రాంబాబు రూ.25 వేల ను మిత్రులు సహాయంతో సేకరించారు.ఇలా సమకూరిన నగదును పేద విద్యార్ధికి అవసరం అయిన లాప్టాప్ కొనుగోలు కోసం అందజేసారు. 30 మంది మున్సిపల్ కార్మికులు కి పారిశుధ్యం పనులు చేసేందుకు గ్లౌజులు అందించారు. 

ఈ కార్యక్రమంలో సత్యవరపు బాలగంగాధర్,ఆర్సీ బోగవల్లి రాంబాబు,ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంక ప్రసాద్,ఆలయ కమిటీ అధ్యక్షుడు ముత్తా సుమాకర్, సమయమంతుల మోహన గంగాధర్ రావు,కాకి రాము, ఆర్యవైశ్య సంఘం టౌన్ ప్రెసిడెంట్ జల్లిపల్లి గుప్తా, బొమ్మ రామకృష్ణ,కంచర్ల జగదీష్,జల్లిపల్లి దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -