Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు నగదు బహుమతులు అందజేత

విద్యార్థులకు నగదు బహుమతులు అందజేత

- Advertisement -

– విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు రూ.25వేల నగదు అందజేత 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 2024-25 విద్యా సంవత్సరంలో  పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువుల్లో ప్రోత్సహించేందుకు గ్రామానికి చెందిన ఎనుగందుల చక్రవర్తి, ప్రతి సంవత్సరం పాఠశాల నుండి పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం రోజున  నగదు ప్రోత్సాహక బహుమతులు అందించేందుకు ముందుకు వచ్చారు. అందులో భాగంగా శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 2024-25 విద్యా సంవత్సరంలో  పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు.

పదో తరగతి ఫలితాల్లో 533 మార్కులతో మొదటి స్థానంలో నిలిచిన కండ్లి అభిలాష్ కు రూ.15వేలు, 518 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచిన మొగిలి అక్షయ్ కుమార్ కు రూ.10వేల నగదు బహుమతులను అందజేశారు. ఎనుగందుల చక్రవర్తి తరపున విద్యార్థులకు నగదు బహుమతులను ఆయన మిత్రుడు నందగిరి దయానంద్ అందించారు. అదేవిధంగా గ్రామానికి చెందిన స్వర్గీయ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పోతు చిన్న రాజేశ్వర్ పాఠశాల పేరుపై చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు రూ.500 నగదు బహుమతులను అందజేశారు. పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు అందించిన దాతలకు పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయులు రాజన్న కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం సభ్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -