ఎస్సి రిజర్వేషన్ 15 నుండి 18శాతం పెంచాలని తీర్మానం చేసిన అమలు జరగలేదు
మంత్రి లక్ష్మణ్ కావాలనే నా మీద విమర్శులు చేస్తున్నారు
నవతెలంగాణ – కంఠేశ్వర్
దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచిన కుల వివక్ష ఉందని రాష్ట్ర మంత్రి వివేక్ వేంకట స్వామీ అన్నారు. జిల్లా మాల సంఘం అధ్యక్షులు చోక్కం దేవిదాస్, కన్వీనర్ అలుక కిషన్ ల అధ్వర్యంలో మాలల ఐక్య సథస్సు అదివారం జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ సధస్సు దివంగత నేత గడ్డం వేంకట స్వామీ( కాకా) జయంతి ఉత్సవం జరిగింది. ఈ సధస్సుకు ముఖ్య అతిథిగా హజరైనా మంత్రి వివేక్ వేంకట స్వామి మాట్లాడుతూ… హైదరాబాద్ లో జరిగిన మాలల గర్జన వల్ల మాలల్లో ఐక్యత పెరిగిందని, దేశంలో ఒక సామాజిక వర్గానికి చెందిన సభ అంతా పెద్దగా జరగటం అదే మొదటిసారి అన్నారు.మాలల కోసం పోరాటం చేస్తుంటే.. కొందరు కుట్రలు చేసి.. సోషల్ మీడియా వేదికగా తనను అవమించే ప్రయత్నం చేశారు అన్నారు.
అనాడు ఎస్సి రిజర్వేషన్ 15 నుండి 18శాతం పెంచాలని తీర్మానం చేసాం.. కానీ జరగలేదన్నారు. రోస్టర్ విధానంలో మాలలకు అన్యాయం జరిగింది. పోరాడితేనే ఫలితాలు వస్తాయి అని పిలుపు నిచ్చారు. దేశంలో ఇంకా కులవివక్ష ఉందని అందుకే మాల ఉద్యోగులకు వేధింపులు తప్పటం లేదుఅని అవేధన వ్యక్తం చేశారు. మాంత్రిగా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను.. ఆయిన నా మీద కావాలనే విమర్శలు చేస్తున్నారు అన్నారు. మంత్రి లక్ష్మణ్ అంశంలోను అనవసరంగా నా పేరు ప్రచారం చేశారు అని గుర్తు చేశారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ ను రాజకీయంగా ప్రోత్సహించింది కాకా..మంత్రి లక్ష్మణ్ కావాలనే నా మీద విమర్శులు చేస్తున్నారు.
నేను మాల జాతి అని మంత్రి లక్ష్మణ్ నను విమర్శలు చెస్తూన్నారు అని తెలిపారు. నాకు మంత్రి పదవి మీద మోజు లేదు..జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు కోసం కష్ట పడుతున్నాం అని తెలిపారు. నేను ఇంచార్జ్ అయ్యాక జూబ్లీ హిల్స్ లో ఓటింగ్ శాతం పెరిగింది. ఒక వర్గం మీడియా కావాలనే నన్ను టార్గెట్ చేసాయి. నేను నిజాయితీగా ఉన్నాను..నిజాయితిగా వ్యాపారాలు చేస్తున్నాను.మాలల అంతా కలిసి ఉండాలని కోరారు.ఈ సధస్సులో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే. నాగరాజు మాట్లాడుతూ…. మాలల వర్గీకరణ కోసం నిరంతరంగా పోరాడుతూనే వస్తున్నామని ఇందుకు అన్ని కుల సంఘాలు సహకరించి బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన బోధించు సమీకరించు పోరాడు అనే సూక్తి ప్రకారం ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. తాను ఐపీఎస్ గా పోలీసు పూర్తిచేసిన సమయంలో ఎంతో ఆప్యాయతగా తన విధులకు ఆటంకం కలిగించకుండా పనిచేశారని గుర్తు చేశారు.
కానీ రాజకీయాల్లో కుల వివక్ష కొనసాగుతుందని దీనిపై పోరాడాలని ఇందుకు మన ఐక్యత మన కార్యచరణ కోసం పోరాడి కొనసాగించాలని అన్నారు. కాకా వెంకటస్వామి కులం మతం అనే వివక్ష లేకుండా అందరినీ కలుపుకొని వెళ్లేవారని వారి అడుగుజాడలో నడుస్తున్న ఆయన తనయుడు వివేక్ వెంకటస్వామి ఆశయ సాధనలో మనమందరం ముందుకు వెళ్దామని ఆయన అన్నారు. అనంతరం ఇటీవల గ్రూప్ వన్, గ్రూప్ 2లో విజయం సాధించిన అభ్యర్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాలల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చెన్నయ్య, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి, రాష్ట్ర వ్యవసాయ , రైతు కమీషన్ సభ్యులు గడుగు గంగాధర్, నాయకులు దయానంధ్,ఎడ్ల నాగరాజు తదితరులు పాల్గోన్నారు.