Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కుల బహిష్కరణ నిలిపివేయాలి..

కుల బహిష్కరణ నిలిపివేయాలి..

- Advertisement -

– కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్..
నవతెలంగాణ – మాక్లూర్ 

కుల బహిస్కరణను నిలిపివేయాలని కుల వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి కొండ గంగాధర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని మానిక్ బండారు సమీపంలో పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్మూర్ మండల కేంద్రంలోనకుల బహిష్కరణ నిలిపివేయాలని అన్నారు. ఆర్మూర్ మండల కేంద్రంలోని సుబిర్యాల గ్రామంలో మాదిగలను కుల బహిష్కరణ చేయడం చట్ట విరుద్ధమైందని, చట్టపరమైన కోర్టులు, చట్టాలు ఉండగా ఆర్మూర్ ప్రాంతంలో కొన్ని ఏళ్ల నుండి ఆనవాయితీగా వీడీసీల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని అన్నారు.

తమకు రావలసిన భూమి, డబ్బులు హక్కులు అడిగితే వారిపై కుల బహిష్కరణ కొనసాగిస్తున్నారన్నారు. దళితులపై ఎక్కువ అణిచివేత కనబడుతోందని అన్నారు. ఈ మధ్యకాలంలో రాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులను, జంక్రంపల్లిలో చాకలి కులస్తులను, పిప్పిరిలో బేస్తవారిని మంతినిలో భూవివాదంలో దళితులను అనేక రూపాల్లో కుల వ్యవస్థ పేరుతో  కుల బహిష్కరణ జరుగుతూనే ఉన్నారన్నారు. కాబట్టి దళితులపై దౌర్జన్యాలు, సమస్యలు ఎక్కువగా పోరాటంతోనే  పరిష్కారం అవుతాయి తెలిపారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తుందని, అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. ఈ బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని మనోవ్యాకులతో చెందిన వారిని భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులు ధైర్యాన్ని కోల్పోవద్దని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img