వి.ఆర్.జి.ఆర్ మూవీస్ బ్యానర్ పై వై.గంగాధర్ ఐపీఎస్ సమర్పణలో, రజని గొంగటి నిర్మాతగా నూతన దర్శకుడు జి.వి.నాయుడు దర్శ కత్వం వహించిన చిత్రం ‘క్యాట్’. ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని, త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ని హీరో అడివి శేష్ అన్నపూర్ణ స్టూడియోలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’నటీనటులకు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’ అని అన్నారు. ‘ఇప్పటివరకు డ్రామా, థ్రిల్లర్ జోనర్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటితో పోలిస్తే ఆద్యంతం వైవిధ్యంగా ఉండే సినిమా ఇది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సరికొత్త అనుభూతిని పొందడం ఖాయం. మా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించి, మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచిన హీరో అడివిశేష్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’ అని మేకర్స్ తెలిపారు. జి.వి.నాయుడు, V.జీ.బాలు, లావణ్య, కళ్యాణి రాణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: పంకజ్ తొట్టాడ, ఎడిటింగ్: డి.వెంకట ప్రభు, మ్యూజిక్: మారుతి రాజా, కథ, స్క్రీన్ ప్లే, మాటలు: వి.సిహెచ్ శేఖర్ ముద్దు, దర్శకత్వం: జి.వి.నాయుడు (గొంగటి వీరాంజనేయులు).
‘క్యాట్’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -



