నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కర్ణాటక , మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన సోపూర్ లో పశువుల మరణాలు ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నాయి అని పాడి రైతులు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం గ్రామంలోని జాన్సన్ అనే పాడి రైతు మూడూ – నాలుగు ఏండ్ల వయస్సు ఉన్న కోడె సుమారు రూ.60 వేల విలువైనది రాత్రి మృత్వువాత పడిందన తెలిపారు. వర్షాకాలం ఉన్నందున భారీ వర్షాలు పడుతూ ఉండడంతో గ్రామానికి వెళ్లడానికి బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నది. కానీ పశు వైద్య బృందం మాత్రం సోమవారం ఇద్దరు కాంపౌండర్లు, గోపాల మిత్రులు వచ్చి కొన్ని పశువులకు వైద్యం చేసి వెళ్లిపోయారని తెలిసింది.
పాడి రైతులు వద్ద ఉన్న పశు సంపద రోజురోజుకు ఒక్కొక్కటి చొప్పున మరణిస్తున్నయని అన్నారు. రాబోయే తరాలకు పశువుల సంపద తరిగిపోతోందని, ఆర్థికంగా తాము నష్టపోతున్నామని పాడి రైతులు ఆవేదన చెందారు. గ్రామంలో పశువుల మరణాలు సంభవిస్తున్న సమయంలో అధికారులు, సంచార పశు వైద్య వాహనాలలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, మండల కేంద్రంలోని వైద్యులు పట్టించుకోవాల్సిన అవసరం ప్రస్తుతం ఆసన్నమైంది. అయినా నిర్లక్ష్యంగా ఉంటూ పట్టించుకోకపోవడం వలన పశు మరణాలు సంభవిస్తున్నాయి అని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి, వెంటనే గ్రామంలో పశువులకు వైద్య శిబిరం నిర్వహించాలని గ్రామ పాడి రైతులు కోరుతున్నారు.
సోపూర్ లో కొనసాగుతున్న పశువుల మరణాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES