Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పశువులను రోడ్డుపై తిరగకుండా చూసుకోవాలి: ఎస్సై శ్రీకాంత్ రెడ్డి

పశువులను రోడ్డుపై తిరగకుండా చూసుకోవాలి: ఎస్సై శ్రీకాంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ -తాడ్వాయి 
పశువులు రోడ్డుమీద తిరగడం, రోడ్డుపైనే తిష్ట వేయడం  ప్రమాదకరం అని, ట్రాఫిక్కు ఆటంకం కలిగిస్తుందని, రైతులు వారి వారి పశువులను రోడ్లపై ఉండకుండా ఇండ్లలకు తీసుకొని వెళ్లి కట్టేసుకోవాలని తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రం 163 వ జాతీయ రహదారిపై పశువుల మంద తిరుగుతూ తిష్ట వేయడంతో ఎక్కడికి క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వాహనాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు. రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న పెంపుడు పశువులు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కల్పించడంతోపాటు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి అన్నారు. రోడ్లపైకి రాకుండా పశువులను కట్టేసుకోకపోతే, పశువుల యజమానులకు చట్టం ప్రకారం యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad