నవతెలంగాణ – మద్నూర్ : రాష్ట్ర ప్రభుత్వం పశువుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు గ్రామ గ్రామాన చేపడుతున్న వాటిని పశువులదారులు టీకాలు సద్వినియోగం పంచుకోవాలని పెద్ద షాక్కర్గ గ్రామ సర్పంచ్ విశాలాక్షి రాం పటేల్ కోరారు. గ్రామంలో పశువులకు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వంలో పశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పశువులకు ఉచితంగా టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టడం సంతోష కరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సలాబత్పూర్, ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, పశు వైద్య అధికారి సునీత పశు వైద్య సిబ్బంది గ్రామస్తులు పశువులదారులు పాల్గొన్నారు.
గాలికుంటు వ్యాధి టీకాలు పశువులకు వేయించాలి: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



