నవతెలంగాణ – ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ లోని ముక్త దేవి కాలనీ లో ఆదివారం రాత్రి హంగిర్గా భోజన్న అనే రైతు కు చెందిన రెండు ఎడ్లు ,ఒక ఆవు ను గుర్తు తెలియనివ్యక్తులు దొంగిలించారు. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం హంగిర్గా భోజన్న తన రెండు ఎడ్లను ఒక ఆవును రోడ్డు పక్కన ఉన్న నీటి ట్యాంకు కింద కట్టేశాడు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ఈ మూడు పశువుల ను దొంగిలించారు. ఈ విషయంను గమనించిన బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు . వెంటనే సంఘటన స్థలాన్ని సోమవారం ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ పరిశీలించారు. పశువుల విలువ సుమారు రూ.2లక్షల వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
ముధోల్ లో పశువుల చోరి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES