- Advertisement -
- ఆందోళనలో రైతులు.
నవతెలంగాణ-ముధోల్: నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో పశువుల దొంగతనలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం క్రితం ముధోల్ గ్రామానికి చెందిన రైతు హంగిర్గా బోజన్నకు చెందిన పశువులు చోరికి గురి అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిఐ మల్లేష్ ఆధ్వర్యంలో దొంగల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఓ వాహనంను స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా ముధోల్‌లోని బాబుపటేల్ అనే రైతు రెండు ఎద్దులను శనివారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరికి యత్నించారు. ఎద్దులు వారిపై దాడికి యత్నించటంతో దొంగలు పరారు అయ్యారు. ఈ ఎద్దులు స్థానిక హనుమాన్ మందిరం వరకు వేళ్ళాయి. అక్కడ ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా భక్తి పాటలు, భజన కార్యక్రమం నిర్వహింస్తున్న స్థానికులు కంట పడ్డాయి. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాగా. పోలీసులు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల దొంగల కోసం వెతికినా ఆచూకీ లభించలేదని, కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇప్పటికే పోలీసులు దొంగతనాలకు అడ్డు కట్ట వేసి రైతులకు భరోసా కల్పించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయం పై ఎస్ఐ బిట్ల పెర్సెస్ ను ఆదివారం నవతెలంగాణ వివరణ కోరగా శనివారం రాత్రి వెంటనే తమ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లారని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నమన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు.
- Advertisement -