Thursday, September 11, 2025
E-PAPER
Homeజిల్లాలుపశువుల దొంగలు అరెస్ట్..

పశువుల దొంగలు అరెస్ట్..

- Advertisement -

రూ.14.50 లక్షల ఆస్తి స్వాధీనం..
ఎస్సై, ఏస్సై, కానిస్టేబుల్స్ ను అభినందించిన ఎస్పీ జానకీ దరావత్ 
నవతెలంగాణ – నవాబ్ పేట
నవాబ్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పశువుల దొంగతనాలపై వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ.. నలుగురు నిందితులను పట్టుకున్నారు అని ఎస్పీ జానకీ దరావత్ తెలిపారు. ఈనెల 2న ఉదయం 9.20 గంటలకు మరికల్ గ్రామ శివారులో పశువులు దొంగతనం జరిగింది. ఈ మేరకు ఫిర్యాదుదారు వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మరికల్ గ్రామానికి చెందిన అంబటి రాములు తన పొలంలో పశువులను దొంగతనం జరిగింది అని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన నవాబ్ పేట పోలీసులు గురువారం 7.00 గంటల సమయంలో గస్తీ నిర్వహించడంతో కన్మన్ కల్వ గ్రామ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను బొలెరో వాహనంలో అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో వారు పశువుల దొంగతనాలను చేసినట్లు ఒప్పుకున్నారు. స్వాధీనం చేసిన ఆస్తి పశువులు 09దూడలు 06 ఉన్నాయని, నిందితులు ఏ1 కుమ్మరి అశోక్ కుమార్, జూలపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా, ఏ2 సర్దన్ అఖిల్, బొమ్మకల్ సైదాపూర్ మండలం కరీంనగర్ జిల్లా, ఏ3 తాటిపల్లి సాయి కుమార్ ముకుందపురం, నల్గొండ జిల్లా, ఏ4 బుర్క సాయి, జనగాం, వరంగల్ జిల్లా ప్రాంతాల వాసులుగా అంతరాష్ట్ర పశువుల దొంగలుగా గుర్తించామని ఎస్పీ తెలిపారు.

వాటి విలువ దాదాపుగా రూ.14,50,000/- (అక్షరాలా పద్నాలుగు లక్షల యాబై వేలు) ఉంటుంది అని, పశువులు రూ.3,00,000/- రికవరి చేశామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి దరావత్ ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన నవాబ్‌పేట్ పోలీస్ బృందం ఎస్సై విక్రమ్, ఏఎస్ఐ జనార్దన్, హెడ్ కానిస్టేబుల్ సురేష్ బాబు, కానిస్టేబుల్ వెంకట్రాములు, భాస్కర్, హోం గార్డ్ శెట్టి నాయక్ లను అభినందించి, క్యాష్ రివార్డ్ ఇచ్చారు.

అలాగే మండల ప్రజలకు నేరాలు దొంగతనాల పట్ల అప్రమత్తం కావాలి అని, ఆయా గ్రామాలలోని ముఖ్య కూడలి లలో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే ఇలాంటి దొంగతనాలు సులువుగా పట్టుకోవచ్చు అని సూచించారు. సీసీ కెమెరాలు వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. అవి ఉండడం వల్లే ఇలాంటి దొంగతనాలను గుర్తించడం, అరికట్టడం సులభమవుతుంది అని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాందీ నాయక్ ఎస్సై విక్రమ్, ఏఎసై జనార్దన్ హెడ్ కానిస్టేబుల్ సురేష్ బాబు కానిస్టేబుల్ వెంకట్రాములు భాస్కర్ ఖాజా, అశోక్, రాములు, శెట్టి నాయక్, లోకేష్, శంకర్ నాయక్, సరిత, మధు, రాజు, రవిందర్ నాయక్ లు తదతరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -