Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనాజిపూర్‌లో పశువులకు గాలికుంటు టీకాలు..

అనాజిపూర్‌లో పశువులకు గాలికుంటు టీకాలు..

- Advertisement -

నవతెలంగాణ – రాయపోల్ : పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అనాజీపూర్ గ్రామ సర్పంచ్ నిర్మల ఇస్తారి పేర్కొన్నారు. గురువారం రాయపోల్ మండలం అనాజీపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తగా టీకాలు వేయడం ఎంతో అవసరమన్నారు. రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి సయ్యద్, జూనియర్ వెటర్నరీ డాక్టర్ జాస్ పాల్ సింగ్, రైతులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -