– లోకాయుక్తలో బీఆర్‌ఎస్‌వీ నేతల ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) బంకర్ బెడ్ల టెండర్లలో రూ.100 కోట్ల కుంభకోణంపై వెంటనే సీబీఐ విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో లోకాయుక్తలో బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో ఫిర్యాదు చేశారు. కేజీబీవీ బంకర్ బెడ్ల టెండర్లలో జరిగిన భారీ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసినా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. సచివాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితారాణాకు ఫిర్యాదు చేసినా ఎలాంటి విచారణ జరపడం లేదని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి అడ్డూఅదుపు లేకుండా కొనసాగుతోందని విమర్శించారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు చదువుకునే కేజీబీవీల్లో మౌలిక వసతుల పేరుతో ఈ టెండర్లలో భారీగా అవినీతి జరిగిందని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతూ, నాసిరకం బంకర్ బెడ్లను సరఫరా చేయడం, టెండర్లలో నియమ, నిబంధనలను ఉల్లంఘించి ట్రూఫా, ముఫత్లాన్ కంపెనీలకు ఎల్ 1, ఎల్ 2 లకు కట్టబెట్టారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రూ.12 వేలకు ఒక్క బెడ్డును స్థానిక ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో టెండర్‌లో భాగస్వామ్యం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే బెడ్డును రూ.35 వేలకు మధ్యప్రదేశ్ నుంచి కొనుగోలు చేస్తూ ఒక్కో బొడ్డుపై రూ.22 వేలు పెంచి కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేలా టెండర్ నిబంధనలను రూపొందిం చిందని విమర్శించారు. మొత్తం బెడ్ల సంఖ్య 45,360 ఒక్కో బెడ్డుకి రూ.33,446 అంటే దాదాపుగా రూ.164 కోట్లను ఢిల్లీలో రాహుల్ గాంధీకి చేరవేస్తున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణంపై వెంటనే సీబీఐతో విచారణ జరపాలనీ, అక్రమాలకు పాల్పడిన అధికారులపై, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కేజీబీవీ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



