Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గగుపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

గగుపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలం గగుపల్లి గ్రామంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వినయ్ ఆదేశాల మేరకు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు గగుపల్లి సర్పంచ్ కొండి నాడ్పి గంగాధర్ ఆధ్వర్యంలో సోమవారం రోజున కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామంలో మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గగుపల్లి గ్రామంలో దశలవారీగా రహదారులు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ప్రజా అవసరాల ప్రాజెక్టులను అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ పాత గంగామణి, వార్డ్ మెంబెర్ ఆకాష్ శెట్టి, మార్కంటి మల్లేష్, సెక్రటరీ కిషోర్ నాయకులు పోతారాజు, గంగాధర్,మదరి శంకర్, మదరి రాణి,తెడ్డు సాయమ్మ, రాసా అజిత్, దయాకర్, సూరజ్, రాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -