నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని రేకులపల్లి తండాలో శుక్రవారం రూ.15 లక్షలతో నిర్మించబోయే సిసి రోడ్డు పనులను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి తండాలలో మంచి రోడ్లు వేయాలనే సంకల్పంతో రూరల్ ఎమ్మెల్యే డా ,భూపతి రెడ్డి కృషితో గ్రామ గ్రామన రహదారులకు ప్రాధాన్యత ఇబ్బడం జరుగుతుందని అన్నారు. అందుకే మండలం లోని అననిగ్రమలకు ,తండాలకు సిసి రోడ్లకు కోట్ల రూపాల నిధులు అందించి పనులు చూరుకగా సాగుతున్నాయని అన్నారు. కార్యక్రమములో గ్రామ సర్పంచ్ రాజేందహర్,ఉపసర్పంచ్ చంద్రశేకర్,మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు చెలిమెల శ్రీనివాస్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగిత్యా నాయక్,లోక్కిడి రాములు,రాజు తదితరులు పాల్గొన్నారు.
రేకులపల్లి తండాలో సీసీరోడ్డు పనులు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



