Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల్లో సీసీ రోడ్లు నాణ్యతగా నిర్మించాలి..

గ్రామాల్లో సీసీ రోడ్లు నాణ్యతగా నిర్మించాలి..

- Advertisement -

– పంచాయతీరాజ్ డిఈఈ బసవలింగం..
నవతెలంగాణ – ఊరుకొండ

గ్రామీణ ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్లు నాణ్యతగా చేపట్టాలని.. సిసి రోడ్లు నాణ్యతగా చేపట్టకుంటే తగు చర్యలు తప్పవని పంచాయతీరాజ్ డిఈఈ బసవలింగం అన్నారు. మంగళవారం ఊరుకొండ మండలంలోని గుండ్లగుంటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్యా తండాలో ఉపాధిహామీ పథకంలో భాగంగా వేస్తున్నటువంటి సిసి రోడ్లను పంచాయతీరాజ్ డిఈఈ బసవలింగం పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ డిఈఈ బసవలింగం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వేస్తున్నటువంటి సిసి రోడ్లను నాణ్యతగా నిర్మించడం వల్ల కొన్ని సంవత్సరాల పాటు ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటాయని, ప్రజా ప్రతినిధులు సీసీ రోడ్లు నాణ్యతగా వేయాలని తెలిపారు. వారి వెంట మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు, స్థానిక సర్పంచ్ జర్పులావత్ రమేష్ నాయక్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -