Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీ సహకారంతో సీతారాంపురంలో సీసీ రోడ్లు ప్రారంభం 

ఎంపీ సహకారంతో సీతారాంపురంలో సీసీ రోడ్లు ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
మహబూబాద్ పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాం నాయక్ సహకారంతో మండలంలోని సీతారాంపురం గ్రామాన్ని బురదమయం లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు సిసి రోడ్డు పనులను ప్రారంభించినట్లు ఆ గ్రామ సర్పంచ్ ధారావత్ భాస్కర్ తెలిపారు. వేల్పుల వెంకన్న ఇంటి నుండి పులిగిల్ల వెంకటమలు ఇంటి వరకు ఈజీఎస్ నిధులైన రూ 5 లక్షలతో సిసి రోడ్డు పనులను ఆ గ్రామ ఉపసర్పంచ్ షేర్ నవీన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని మౌలిక వసతులు అన్ని ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు.

అందులో భాగంగా ఈ వీధిలో సీసీ రోడ్డు లేక బురదమయంతో ఆ వాడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అనడంతో వెంటనే అక్కడ సిసి రోడ్డు నిధులు ఈజీఎస్ ద్వారా ఎంపీ బలరాం నాయక్ సహకారంతో నిధులు తీసుకొచ్చి ఈ పనులను ప్రారంభించాడు చెప్పారు. రానున్న రోజుల్లో ఈ గ్రామంలో అన్ని విధులు సిసి రోడ్డు పనులు మరియు వీధిలైట్లు ప్రజలకు త్రాగునీరు లాంటివి గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులను సభకురుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేర్ నవీన్ రెడ్డి, వేల్పుల లలిత, నాయకులు ఎల్లు శ్రీనివాస్ రెడ్డి, వేల్పుల మల్లయ్య, వేల్పుల మహేష్, షేర్ వెంకట్ రెడ్డి, లింగంపల్లి వెంకన్న, లింగంపల్లి సోమయ్య, రాపాక విజయ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -