సున్నపురాళ్ల తండాలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాధరి ప్రశాంత్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సహకారంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించినట్లు ఆ గ్రామ సర్పంచ్ మాధురి ప్రశాంత్ ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఆ గ్రామ శివారు సున్నపురాళ్ల తండాలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులైన రూ 5 లక్షలతో తండాలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామంలోని బురదమయం లేకుండా అన్ని వీధులలో సిసి రోడ్డు పనులను నిర్వహిస్తామని అన్నారు. గ్రామంలో ప్రజలకు అవసరం పడే అన్ని మౌలిక వసతులను గుర్తించి క్రమక్రమంగా ఎమ్మెల్యే మురళి నాయక సహకారంతో అధిక నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినంక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి గడపగడపకు చేరే విధంగా కృషి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రామగిరి సుమన్ వార్డు సభ్యులు కృష్ణ, లలిత ,మహేష్, పంతులు, పంచాయతీ సెక్రటరీ సుంకరి మధు, ఫీల్డ్ అసిస్టెంట్ గుగులోత్ నాగమణి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బెల్లి నర్సయ్య, నాయకులు మద్దెల సమ్మయ్య,డోనికాని మల్లయ్య,ఆవుల వెంకన్న, నర్సింగ అశోక్,చీమకుర్తి.శ్రీనివాస్,పోతారాజ్ శ్రీశైలం,గుర్రాల నరేష్దా,రావత్ లాలు, యాకుబ్, గుగులోత్ రవి, బూర్గుల అశోక్, బందు రాములు, వెంకట్ రెడ్డి,గుగులోత్ నంద్యా, తదితరులు పాల్గొన్నారు.



