నిబంధనలు సడలించి పత్తిని కొనుగోలు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్
పార్టీ ఆధ్వర్యంలో మార్కెట్‌లో ప్రదర్శన, ధర్నా
నవతెలంగాణ-గాంధీ చౌక్
ఖమ్మం పత్తి మార్కెట్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ప్రయివేట్ వ్యాపారుల దోపిడీని అరికట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం పత్తి మార్కెట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తిని పరిశీలించి రైతులతో మాట్లాడారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో, ఖమ్మం మార్కెట్‌లో తమకు ఎదురవుతున్న సమస్యలను, దోచుకుంటున్న తీరును పలువురు రైతులు వివరించారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో సాంకేతిక సమస్య వల్ల స్థానిక ఏఓ ఖమ్మం మార్కెట్‌లో అమ్ముకొమ్మన్నారని, అందుకే ఖమ్మం తీసుకొచ్చానని రైతు శ్రీను తెలిపారు. అధికారులు రైతులకు సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొనుగోలు సందర్భంగా సీసీఐ అనేక కొర్రీలు పెడుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
దీనికి స్పందించిన పోతినేని.. సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని ఏవోతో ఫోన్లో మాట్లాడారు. పోతినేని మాట్లాడుతూ.. సీసీఐ కొను గోలు కోసం ప్రభుత్వం జిన్నింగ్ మిల్లులకు, యాజమాన్యాలకు అనుకూలంగా నిబంధనలు ఏర్పాటు చేసి రైతులను గోస పెడుతుందని అన్నారు. విదేశీ పత్తిని దిగుమతి చేసుకునేందుకు సుంకాన్ని ఎత్తేసిన కేంద్రం.. మన రైతుల పత్తిని కొనుగోలు చేసేందుకు మాత్రం కొత్త నిబంధనలు పెట్టి అంబానీ, ఆదానీ వంటి బడా బాబులకు, పెట్టుబడిదారులకు దోచిపెడుతోందని అన్నారు. వెంటనే ఖమ్మం మార్కెట్‌లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఏడు క్వింటాళ్ల కొనుగోలు నిబంధనను ఎత్తేసి రైతుల వద్ద ఉన్న పత్తి మొత్తాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, మాదినేని రమేష్, యర్రా శ్రీనివాస రావు, జిల్లా నాయకులు ఎస్కే నాగుల్ మీరా, పట్టణ టూ టౌన్, త్రీ టౌన్ల కార్యదర్శులు బోడపట్ల సుదర్శన్, భూక్య శ్రీనివాసరావు, అర్బన్ మండల కార్యదర్శి బత్తిని ఉపేందర్, రఘునాథపాలెం మండల కార్యదర్శి ఎస్.నవీన్ రెడ్డి, డివిజన్ సెక్రటేరియట్ సభ్యులు పత్తిపాక నాగసులోచన, పార్టీ త్రీ టౌన్ సెక్రటేరియట్ సభ్యులు, 31వ డివిజన్ కార్పొరేటర్ ఎర్ర గోపి, 35వ డివిజన్ కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకట్రావు, నాయకులు షేక్ సైదులు, షేక్ ఇమామ్, ఎర్ర రంజిత్, పార్టీ సీనియర్ నాయకులు బండారు యాకయ్య, 3 టౌన్ నాయకులు ఎస్కే బాబు, రంగు, హనుమంతచారి, డివిజన్ నాయకులు జె.వెంకన్న, బాబు, మేడబోయిన లింగయ్య, గాలి వెంకటాద్రి పాల్గొన్నారు.
ఖమ్మంలో సీసీఐ కేంద్రం పెట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



