Saturday, November 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీసీఐ ఆంక్షలు తొలగించాలి

సీసీఐ ఆంక్షలు తొలగించాలి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ- నయీంనగర్‌

సీసీఐ ద్వారా కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ఎక్కడా అమలు కావడం లేదని, పత్తి కొనుగోళ్లపై విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. హనుమకొండ జిల్లా రామ్‌నగర్‌లోని సీపీఐ(ఎం) కార్యాలయంలో శుక్రవారం బొట్ల చక్రపాణి అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడారు. సమస్య పరిష్కారం కోసం రాష్ట్రంలోని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజీపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పత్తి తడిసిపోయిందని, సీసీఐ ద్వారా క్వింటాకు రూ.8100 మద్దతు ధర కేంద్రం ప్రకటించినా ఎక్కడా అమలు కావడం లేదని తెలిపారు.

12శాతం తేమ పేరుతో పంటను కొనుగోలు చేయకపోవడం అన్యాయమని, తీవ్ర చలి ఉన్న నేపథ్యంలో 12% లోపు తేమ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దళారీల చేతిలో రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కపాస్‌ కిసాన్‌ యాప్‌ సాంకేతిక సమస్యలతో స్లాట్లు బుక్‌ కాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు, జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -